
పచ్చిరొట్ట ప్రాధాన్యత మరవొద్దు
వర్గల్(గజ్వేల్): సస్యరక్షణలో రసాయన, పురుగు మందులను అవసరం మేరకే వాడాలని తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీజయ, రమాదేవి అన్నారు. మంగళవారం వర్గల్ మండలం తున్కిఖాల్సా రైతువేదికలో ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయన పురుగుమందులు సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వాడాలని సూచించారు. సస్యరక్షణలో జీవనియంత్రణ, సాగు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలన్నారు. పచ్చిరొట్ట ప్రాధాన్యత విస్మరించొద్దన్నారు. పంట మార్పిడి, వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, మినుములు, పెసర్లు, పొద్దుతిరుగుడు పంటలు వేసుకోవాలన్నారు. ఏఓ శేషశయన మాట్లాడుతూ రైతులు విశిష్ఠ గుర్తింపు సంఖ్య కోసం ఏఈఓలను సంప్రదించి నమోదుచేయించుకోవాలన్నారు. ఉద్యానఅధికారి రమేష్ కూరగాయ, పండ్లతోటల యాజమాన్యం గురించి వివరించారు.
అవసరం మేరకే
రసాయన ఎరువులు వాడాలి
తోర్నాల వ్యవసాయ
పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు