లక్ష్యంపైనే గురి పెట్టండి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యంపైనే గురి పెట్టండి

Mar 16 2025 7:43 AM | Updated on Mar 16 2025 7:42 AM

కొమురవెల్లి(సిద్దిపేట): విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి అనుకున్న లక్ష్యంపైనే గురిపెట్టాలని జిల్లా కలెక్టర్‌ మిక్కిలేని మనుచౌదరి సూచించారు. మండలంలోని గురువన్నపేట పాఠశాలలో ఎఫ్‌.ఎల్‌.ఎన్‌ (ఫౌండేషన్‌ లిటరసీ న్యూమరసీ) ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు డీఈవో శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఏఐ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...జిల్లాలో ఏఐ ద్వారా విద్యాబోధన చేసేందుకు 31 పాఠశాలలు ఎంపిక చేసి ప్రస్తుతం 29 పాఠశాలలో ప్రారభించామన్నారు. జిల్లాలో రూ.30 కోట్లతో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా టాయిలెట్స్‌, అదనపు తరగతి గదులు, ప్రహరీగోడలు తదితర నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు భాషపై పట్టు ఉంటే విజయం సాధిస్తారని తెలిపారు. విద్యార్థులు ప్రతీరోజు వార్త పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇష్టమైన రంగాలలో కష్టపడితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

బడిలో నేర్పిన విలువలే పాటిస్తారు

విద్యార్థులకు స్టేజ్‌ ఫియర్‌ లేకుండా ప్రతీ రోజు ఒక్కో విద్యార్థితో వర్తమానం అంశాలపై మాట్లాడించాలని, పాఠశాలలో నేర్పిన విలువలు జీవితాంతం పాటిస్తారని ఉపాధ్యాయులకు కలెక్టర్‌ సూచించారు. పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు, పాఠశాల ప్రహరీగోడ, 5 కంప్యూటర్లను వెంటనే మంజూరు చేస్తానని హామీనిచ్చారు. వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగితే పాఠశాలకు బస్సు, అదనపు తరగతి గదులు, సైన్స్‌ల్యాబ్‌లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి రామస్వామి, ఏఎస్‌వో భాస్కర్‌, తహసీల్దార్‌ దివ్య, ఎంపీడీవో శ్రీనివాస వర్మ, ఎంఈవో రమేశ్‌, ఎస్‌ఐ రాజు, పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు బి.రాజు, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌లు పాల్గొన్నారు.

ఇష్టమైన రంగాల్లో కృషి చేస్తే సత్ఫలితాలు

కలెక్టర్‌ మిక్కిలినేని మనుచౌదరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement