‘మహనీయుల జయంతి’ ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘మహనీయుల జయంతి’ ఘనంగా నిర్వహించాలి

Apr 1 2023 5:50 AM | Updated on Apr 1 2023 5:50 AM

మాట్లాడుతున్న డీఆర్‌ఓ లక్ష్మీకిరణ్‌ - Sakshi

మాట్లాడుతున్న డీఆర్‌ఓ లక్ష్మీకిరణ్‌

సిద్దిపేటరూరల్‌: జిల్లాలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని డీఆర్‌ఓ లక్ష్మీకిరణ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాలోని వివిధ దళిత సంఘాల నాయకులతో డీఆర్‌ఓ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్‌ 5న బాబుజగ్జీవన్‌ , ఏప్రిల్‌14న అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. ఈ ఉత్సవాల్లో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమ విజయవంతంలో దళిత సంఘాల పాత్ర అత్యంత ముఖ్యమైనదన్నారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమాఽధికారి కవిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement