
అర్జీలు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
సిద్దిపేటరూరల్: వివిధ సమస్యలపై అర్జీదారులు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో డీఆర్‌ఓ లక్ష్మికిరణ్, ఏఓ రెహమాన్‌తో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తే ప్రజావాణిపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్నారు. భూ సంబంధ, రెండు పడక గదుల ఇళ్ల, ఆసరా పింఛన్లు తదితరాలపై 93 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
సభ్యత్వం ఇప్పించండి: చేబర్తి మత్స్యకారులు
మర్కూక్ మండలం చేబర్తి గ్రామంలో పెద్ద చెరువుతో పాటు 8 కుంటల్లో 56 మందికి సొసైటీ సభ్యత్వం ఉంది. చేపల వేటకు అన్ని రకాలుగా నైపుణ్యం కలిగిన యువత గ్రామంలో సుమారు 200 మంది ఉన్నారు. నైపుణ్య పరీక్షలు నిర్వహించి వీరందరికి ప్రాథమిక మత్స్య సహకార సంఘంలో సభ్యత్వం ఇప్పించాలి.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
ప్రజావాణికి 93 దరఖాస్తులు
బతికున్నా.. మృతుడిగా నమోదు చేశారు
నాపేరు ఆలేటి పోచయ్య. చిన్నకోడూరు మండలం, పెద్దకోడూరు గ్రామం. ఆసరా పెన్షన్‌కు సంబంధించి మీసేవా రికార్డులో చనిపోయినట్లు నమోదు చేశారు. దీంతో నాకు పెన్షన్ రావడం లేదు. ఈ విషయంపై అధికారులకు అర్జీ పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఉన్నతాధికారులు స్పందించి పెన్షన్ వచ్చేలా చూడాలి.
