పచ్చని చెట్టుకు నిప్పు | - | Sakshi
Sakshi News home page

పచ్చని చెట్టుకు నిప్పు

Nov 13 2026 8:33 AM | Updated on Nov 13 2026 8:33 AM

పచ్చని చెట్టుకు నిప్పు నేడు డయల్‌ యువర్‌ డీఎం శబరిమలకు ఆర్టీసీ అద్దె బస్సులు 15న ఆర్చరీ జట్టు ఎంపికలు సీఐటీయూతోనే హక్కుల సాధన ‘పీఎఫ్‌ కార్యాలయం ప్రారంభించండి’

వట్‌పల్లి(అందోల్‌): అందోల్‌ మండలం కన్‌సాన్‌పల్లి గ్రామరోడ్డు వద్ద నాందేడ్‌–అకోలా జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ మర్రిచెట్టుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించడంతో పూర్తిగా కాలిపోయింది. అప్పట్లో రహదారి నిర్మాణ సమయంలో రోడ్డుకు అడ్డుగా ఉన్న కొన్ని భారీ వృక్షాలను నరకకుండా హైవే అధికారులు క్రేన్ల సహాయంతో అతికష్టంగా వేర్లతో సహా చెట్టును తీసి రోడ్డు పక్కనాటారు. వాటిలో అన్ని చెట్లు చనిపోగా కన్‌సాన్‌పల్లి రోడ్డు వద్ద నాటిన చెట్టు ఒక్కటే చిగురించింది. ఆ చెట్టు ప్రస్తుతం బుగ్గి కావడంతో అధికారుల చేసిన శ్రమ వృధా అయినట్లయింది.

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ డిపోలో శుక్రవారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం రాజేశ్వరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు డిపో పరిధిలోని ప్రయాణికులు సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను 9959226269 నంబర్‌లో తెలియజేయాలని కోరారు.

నారాయణఖేడ్‌: అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు వెళ్లడానికి ఖేడ్‌ ఆర్టీసీ డిపో నుంచి అద్దె బస్సులు నడుపుతామని డీఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. 36 సీట్ల కెపాసిటీ గల నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సును కిలోమీటర్‌కు రూ.59, 50 సీట్ల కెపాసిటీ గల ఎక్స్‌ప్రెస్‌ బస్సుకు రూ. 62, 40 సీట్ల కెపాసిటీ గల డీలక్స్‌ బస్సుకు రూ.57 చార్జీ టోల్‌గేట్‌ రుసుముతో కలిపి ఉంటుందన్నారు. ఒక్కో బస్సుకు రూ.300 వెయిటింగ్‌ చార్జీ, గురుస్వామి బస్సు బుక్‌ చేస్తే వారికి ప్రయాణ చార్జీ మినహాయింపు ఉంటుందన్నారు. ఒకటి కన్నా ఎక్కువ బస్సులను బుక్‌ చేసిన గురుస్వాములకు రెండో బస్సుకు రూ.300 కమీషన్‌ ఇస్తామని వెల్లడించారు.

సంగారెడ్డి క్రైమ్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఆర్చరీ టోర్నమెంట్‌ కోసం ఈ నెల 15న అండర్‌– 10, 13, 15 జట్టు ఎంపికలు చేపడుతున్నట్లు జిల్లా ఆర్చరీ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. సంగారెడ్డిలోని అంబేద్కర్‌ స్టేడియంలో ఉదయం 10 గంటలకు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 14వ తేదీలోగా అన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. క్రీడాకారులు తమ పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఆధార్‌, బోనఫైడ్‌, రెండు ఫొటోలతో సకాలంలో హాజరుకావాలని సూచించారు.

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): కార్మిక హక్కుల సాధన, ఉద్యోగ భద్రత సీఐటీయూతోనే సాధ్యమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. గురువారం మండలంలోని చందాపూర్‌ శివారు పెన్నార్‌ పరిశ్రమ యూనియన్‌ వెరిఫికేషన్‌ ఎన్నికల నేపథ్యంలో గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో సీఐటీయూ ను గెలిపిస్తే పరిశ్రమలో కార్మికులకు చరిత్రాత్మకమైన వేతన ఒప్పందం చేస్తామని హామీ ఇచ్చా రు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ఎన్నికల్లో సీఐటీయూను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు మాణిక్యం, ప్రవీణ్‌ కుమార్‌, శ్రీనివాస్‌, మల్లేశం, రవి నాగరాజు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

పటాన్‌చెరు: పటాన్‌చెరు బస్టాండ్‌ మొదటి అంతస్తులో పీఎఫ్‌ తాత్కాలిక కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం పటాన్‌చెరు పీఎఫ్‌ కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో కలిసి బస్టాండ్‌ మొదటి, రెండో అంతస్తుల్లో కొత్తగా చేపట్టిన నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి పీఎఫ్‌ సేవలను స్థానికంగానే కార్మికులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే కర్ధనూర్‌లో శాశ్వత భవన నిర్మాణానికి స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement