ఎంపీ రఘునందన్‌రావు
రామచంద్రాపురం(పటాన్చెరు): అమీన్పూర్ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వంద పీట్ల రోడ్డు సాకారం దిశగా అడుగులు పడుతున్నాయని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని లింగంపల్లి చౌరస్తాలోని నాలాపై నిర్మిస్తున్న వంతెన పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. లింగంపల్లి చౌరస్తా నుంచి అమీన్పూర్ వరకు రోడ్డు అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు అభివృద్ధి కోసం గత రెండేళ్లుగా జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులతో పలుమార్లు సమావేశం నిర్వహించామన్నారు. లింగంపల్లి చౌరస్తాను అనుకొని ఉన్న నాలాపై బాక్స్ కల్వర్టును నిర్మించి దానిపై రోడ్డు వేస్తామన్నారు. అదే మాదిరిగా అమీన్పూర్ బంధం కొమ్ము చెరువు వద్ద రోడ్డు నిర్మాణం కోసం ఎదురవుతున్న సమస్యలను సైతం పరిష్కంచామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా దిశా కమిటీ సభ్యులు కాసాల సుధాకర్, డివిజన్ బీజేపీ ఆధ్యక్షుడు నర్సింగ్‌గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


