ఇంటికో ఇంకుడు గుంత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఇంటికో ఇంకుడు గుంత తప్పనిసరి

Nov 13 2026 8:33 AM | Updated on Nov 13 2026 8:33 AM

హత్నూర(సంగారెడ్డి): ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతను నిర్మించుకునేలా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఎల్‌పీఓ అనిత అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంకుడు గుంత నిర్మిస్తేనే నూతన ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్కను వృథా చేయకుండా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం హత్నూరలో నూతనంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం కోసం పోసిన ముగ్గును పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ యూసుఫ్‌, ఏపీఓ ప్రవీణ్‌, సర్పంచ్‌ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

డీఎల్‌పీఓ అనిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement