సర్వే నంబర్ 92లో తనకు 3.30 ఎకరాల భూమి ఉంది. ఇందులో కేవలం 1.30 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం అందింది. మిగిలిన రెండు ఎకరాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు.. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వేకు రావడం సరికాదు. బాధితులకు న్యాయం జరిగే వరకు భూముల జోలికి రావద్దు
– కృష్ణ, సర్పంచ్, మునిదేవునిపల్లి
ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్లు
సమాచారం
మునిదేవునిపల్లి సర్వే నంబర్ 92లోని 288 ఎకరాల భూమిని టీజీఐఐసీ తీసుకుంది. ఇందుకు రైతులు కూడా అంగీకారం తెలిపారు. కొంతమంది రైతులకు నష్టపరిహారం బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. భూములను సర్వే చేసి టీజీఐఐసీకి అప్పగించాల్సి ఉందని, అయితే కొంత ఆలస్యమైంది. ప్రైవేటు వ్యక్తులు సర్వేకు వచ్చినట్లు సమాచారం అందగానే వారిని వెనక్కి పంపించాం. – అశోక్, తహసీల్దార్, కొండాపూర్


