కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

Nov 11 2026 9:34 AM | Updated on Nov 11 2026 9:34 AM

దుబ్బాక: వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ కీర్తి రాజు కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా దేవునిపల్లికి చెందిన న్యాంతాబాద్‌ వైష్ణవి(26)కి దుబ్బాక పట్టణానికి చెందిన గజభీంకార్‌ వినయ్‌ కుమార్‌తో 2024 నవంబర్‌లో వివాహం జరిగింది. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. కొన్ని రోజులుగా భర్త, అత్తింటి వారితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె జీవితంపై విరక్తి చెంది ఇంట్లోని బెడ్రూమ్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని మృతి చెందింది. పోలీసులు పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం దుబ్బాక ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

అనారోగ్య సమస్యలతో వ్యక్తి..

తొగుట(దుబ్బాక): అనారోగ్య సమస్యలతో వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బంజేరుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. తొగుట ఎస్‌ఐ నవీన్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల సిద్దిరాములు (48) కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబీకులు చికిత్స చేయించారు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సిద్దిపేట ఆస్పత్రికి వెళ్తున్నానని భార్య నిర్మలకు చెప్పాడు. ఆమె వ్యవసాయ పనులకు వెళ్లగా మధ్యాహ్నం బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు.

పెద్దరాజుపేటలో వృద్ధుడు..

చేర్యాల(సిద్దిపేట): వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని పెద్దరాజుపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, కొమురవెల్లి పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లె చంద్రయ్య(60) కొద్ది రోజులుగా భూ సమస్య ఎదుర్కొంటున్నాడు. కాగా మంగళవారం ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బెదిరింపులు, భూ సమస్యతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement