కుక్కను తప్పించబోయి.. వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కుక్కను తప్పించబోయి.. వ్యక్తి మృతి

Nov 11 2026 9:34 AM | Updated on Nov 11 2026 9:34 AM

రామాయంపేట(మెదక్‌): దారికి అడ్డొచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డుపై పడిపోయిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగి మండల కేంద్రానికి చెందిన మోతుకు లక్ష్మణ్‌(50) స్కూటీపై రామాయంపేటకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్టణ శివారులో అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి లక్ష్మణ్‌ కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందజేశాడు. అంబులెన్సులో బాధితున్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు. మృతుని కుమారుడు వేణు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నారాయణ కేసు నమోదు చేశారు.

గాయపడిన వ్యక్తి..

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): రోడ్డు ప్రమాదంతో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువకుడు చివరకు తనువు చాలించాడు. న్యాల్‌కల్‌కు చెందిన ఇద్దరు యువకులు జహీరాబాద్‌ సమీపంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా పరిశ్రమలో పని చేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని న్యామతాబాద్‌ గ్రామ శివారులో సోమవారం తెల్లవారు జామున రోడ్డుపై ఆగి ఉన్నలారీ ఢీకొట్టి తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో బొల్లి శ్రీకాంత్‌ మృతి చెందగా, ఎలుకరి సాయి కిరణ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం అతడు మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement