బాలుడిపై కేసు
హవేళిఘణాపూర్(మెదక్): బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో బాలుడిపై కేసు నమోదైంది. వివరాలు ఇలా.. మెదక్ పట్టణంలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల బాలుడు అదే వీధిలో ఉన్న 13 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు.
అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు
హవేళిఘణాపూర్(మెదక్): పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులే పెద్దపెద్ద చెట్లను నరకడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లి పాఠశాల ఆవరణలో కోతులు వస్తున్నాయనే సాకుతో విద్యార్థులకు నీడగా ఉన్న పెద్ద చెట్లను తొలగించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటి ఏళ్లుగా పెరిగిన చెట్లకు అధికారుల అవగాహన లోపంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని తెలిపారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


