తుక్కాపూర్‌లో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తుక్కాపూర్‌లో అగ్నిప్రమాదం

Nov 11 2026 9:34 AM | Updated on Nov 11 2026 9:34 AM

● మూడిళ్లకు నిప్పు

● రూ.3లక్షల ఆస్తి నష్టం

తొగుట(దుబ్బాక): ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకుని సుమారు రూ.3లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన మండలంలోని తుక్కాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిక్కుడు నారాయణ కుటుంబం ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లారు. కొద్దిసేపటికి ఇంట్లో మంటలు రావడంతో చుట్టుప్రక్కల వారు గమనించి ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మంటలు అధికమై పక్క ఇళ్లకు వ్యాపించాయి. గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో చిక్కుడు నారాయణ కూతురు వివాహం కోసం కొనుగోలు చేసిన కూలర్‌, ఫ్రిడ్జ్‌ వంటి వస్తువులతో పాటు దుస్తులు, బియ్యం కాలిబూడిదయ్యాయి. సమీపంలోని కనకయ్య, మల్లయ్య ఇళ్లకు మంటలు వ్యాపించి నష్టం వాటిల్లింది. రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement