ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పదో తరగతి విద్యార్థుల ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు, యూడైస్ ప్లస్ డేటాలో చిన్నపాటి తప్పులు దొర్లితే సవరించే అధికారం ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ జగ్గు మల్లారెడ్డి అన్నారు. మంగళవారం బీస్మాట్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదో పరీక్షల సన్నద్ధతపై దృష్టి పెట్టాల్సిన సమయంలో విద్యార్థుల పేర్లు, ఇంటి పేర్లు, అక్షర దోషాలు, పేర్ల మధ్య ఖాళీల సవరణకు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని పేర్కొన్నారు. తక్షణమే పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ప్రధానోపాధ్యాయులకు సవరణ వెసులుబాటు అవకాశం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బీస్మాట్ నాయకులు సత్యం, శ్రీకాంత్, రవీందర్‌రెడ్డి, సికిందర్, వెంకటేశ్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.


