● అదనపు కలెక్టర్లు సంగీత, పాండు
● ప్రజావాణిలో 32 వినతుల స్వీకరణ
సంగారెడ్డి జోన్: ప్రజావాణి అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సంగీత, పాండు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సమర్పించే ప్రతి అర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. మొత్తం 32 వినతులు రాగా, సంగారెడ్డి డివిజన్‌లో 9, నారాయణఖేడ్ 1, జహీరాబాద్ 1, సంగారెడ్డి కలెక్టరేట్‌లో 21 అర్జీలు వచ్చాయి. అందోల్ డివిజన్ నుంచి ఎలాంటి వినతులు అందలేదు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు అఖిలేశ్ రెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


