రేపు టామ్‌ కామ్‌ అభ్యర్థుల నమోదు | - | Sakshi
Sakshi News home page

రేపు టామ్‌ కామ్‌ అభ్యర్థుల నమోదు

Nov 10 2026 8:27 AM | Updated on Nov 10 2026 8:27 AM

జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక

సిద్దిపేటరూరల్‌: వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను అందించేందుకు నిర్వహిస్తున్న టామ్‌ కామ్‌ అభ్యర్థుల నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యం , సెమీ స్కిల్డ్‌ నైపుణ్యం కలిగిన వారికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ , రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాల శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నెల 11న సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో అభ్యర్థుల నమోదు చేసుకోనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వివిధ దేశాలు, ఉద్యోగాల వివరాలు, అర్హతల కోసం www.tomcom. telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

ఎకో బిక్స్‌ ప్రాజెక్ట్‌

రాష్ట్ర స్థాయికి ఎంపిక

మద్దూరు(హుస్నాబాద్‌): జిల్లా స్థాయి 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీల్లో దూల్మిట్ట ఉన్నత పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రూపొందించిన వెల్త్‌ ఫ్రమ్‌ వేస్ట్‌ –కో బిక్స్‌ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు చిలక వెంకటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న వేణుగోపాల్‌, కృష్ణ మనోహర్‌ రూపొందించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగకరమైన ఎకో బిక్స్‌గా మలుస్తూ రూపొందించిన ఈప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికై ందన్నారు. ప్రాజెక్టు గైడ్‌ టీచర్‌ శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ విజయం సాధించి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌

విడుదల చేయాలి

సిద్దిపేటరూరల్‌: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ పొన్నాల వెంకట సాయి నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి తమ పిల్లలను నర్సింగ్‌ కళాశాలలో చేర్పించామన్నారు. ప్రతి సంవత్సరానికి రూ. 36 వేల చొప్పున మూడు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో కళాశాల యాజమాన్యం ఫీజులు అడుగుతోందన్నారు. వేలల్లో ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, తమ పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రాన్ని అందజేశారు.

చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

దుబ్బాకటౌన్‌: చోరీలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ టి.రేణుక బేగంపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. శనివారం వర్గల్‌ మండలం నెంటూర్‌ గ్రామానికి చెందిన బణపురం శ్రీనివాస్‌ తన ఇంటి పక్కన గుడిసెలో బోర్‌ మోటార్‌ పైపు కప్లింగ్‌, వాహనం జాకీ, ఎలక్ట్రీషియన్‌ సామగ్రిని ఉంచాడు. వాటిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం శాకారం రోడ్‌ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. అతని వద్ద ద్విచక్ర వాహనం, బోర్‌ మోటార్‌ పైపు కప్లింగ్‌, జాకీలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement