రూ. 12 లక్షల ఆస్తి నష్టం
కొండపాక(గజ్వేల్): షార్ట్ సర్క్యూట్‌తో ఆటోమొబైల్ షాపు దగ్ధమైంది. దీంతో సుమారు రూ.12 లక్షల విలువ చేసే సామగ్రి కాలి బూడిదైంది. ఈ ఘటన కుకునూరుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన భువనగిరి చందు రాజీవ్ రహదారి ప్రక్కన లక్ష్మి నర్సింహ ఆటో మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. దీపావళీ సందర్భంగా రాత్రి దుకాణంలో పూజలు చేసి మూసివేసి ఇంటికెళ్లాడు. సోమవారం ఉదయం దుకాణం లోంచి పొగలు వస్తున్న విషయాన్ని తపాస్‌పల్లి సత్యనారాయణ ఫోన్ ద్వారా చందుకు సమాచారం అందించగా దుకాణం వద్దకు చేరుకొని షట్టర్‌ను తెరిచాడు. వెనక భాగంలో ఉన్న సబ్జా పైనుంచి పొగలు వస్తుండటంతో నీటితో ఆర్పే ప్రయత్నం చేశాడు. చూస్తుండగానే మంటలు దుకాణం మొత్తం వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి చెప్పారు. ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలికి వచ్చేలోపు దుకాణంలో ఉన్న విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. పూజల కోసం వెలిగించిన దీపాలతో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి దుకాణం దగ్ధమైనట్లు బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు.
విఘ్నేశ్వర కాలనీలో..
నర్సాపూర్: టపాసుల నిప్పురవ్వలంటుకొని పండుగ వేళ ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా... పట్టణంలోని విఘ్నేశ్వర కాలనీలో నివాసం ఉండే శ్రీనివాస్‌గుప్తా ఆదివారం రాత్రి స్థానిక గుడిలో పూజలు చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. ఇంటి చుట్టుపక్కల నివాసం ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు టపాసులు కాల్చడంతో నిప్పు రవ్వలు శ్రీనివాస్గుప్తాకు చెందిన ఇంటి మొదటి అంతస్తులోని కిటికీ ద్వారా బెడ్రూమ్లో పడ్డాయి. దీంతో పరుపులు, టీవీ, బట్టలు, ఇతర సామాన్లు కాలి బూడిదయ్యాయి. కిటికీ నుంచి పొగ రావడాన్ని చుట్టుపక్కల వారు గుర్తించి శ్రీనివాస్గుప్తాకు, అగ్నిమాపక అధికారులకు చెప్పారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.


