కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇళ్లు, దుకాణాల్లో లక్ష్మి పూజలు నిర్వహించి, దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి అంగరంగ వైభవంగా పండగను జరుపుకుంటారు. కాగా టపాసులు కాల్చే సమయంలో పిల్లలు, పెద్దలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఊరంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంటే.. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదల జీవితాలు మాత్రం చీకట్లోనే మగ్గుతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా విభిన్న కథనాలు..
కుటుంబ సమేతంగా జరుపుకొనే పండుగ
దీపావళి..
పూజలు నిర్వహించి.. దీపాలు వెలిగించి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పూర్వం నరకాసురుడు తన రాజ్యంలో ఉన్న ప్రజలను కష్టాల పాలు చేస్తూ, సీ్త్రలను చెరబడుతూ, ముల్లోకాల్లో ఉండే దేవతగణాలను, రుషులు, మునులను పీడించే వాడు. శ్రీకృష్ణుడు, సత్యభామ సమేతంగా వెళ్లి చతుర్దశి నాడు నరకాసురుడిని అంతమొందిస్తారు. అందువల్ల చతుర్దశి నాడే దీపావళి పండుగను నిర్వహిచుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
కేదారేశ్వర వ్రతం...
దీపావళి నుంచి కార్తీక పౌర్ణమి వరకు కేదారేశ్వరుల అనుగ్రహం కోసం ప్రజలు నోములు చేస్తారు. ఇందులో సీ్త్రలు తాము సౌభాగ్యంగా ఉండాలని తమ కుటుంబం అష్టైశ్వర్యాలను కల్గి ఉండాలని పార్వతీదేవిని పూజిస్తారు. నోము నోచుకున్న రోజు సీ్త్రలకు వాయినాలు ఇస్తారు. కుటుంబంలోని మహిళలందరూ పూజలో పాల్గొంటారు. కేదారేశ్వర వ్రతానికి అవసరమైన కుండలు, పసుపు, కుంకుమ, పూలు, ఇతర పూజ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్‌లు సందడిగా మారాయి. ధరలు పెరిగాయని, కొనుగోళుదారులు వాపోతున్నారు.


