చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని ఆకునూరు గ్రామ శివారు మాసిరెడ్డిపల్లిలో ఇరిగేషన్ శాఖ పరిధిలో నమోదైన తాళ్లకుంట చెరువు కట్ట ధ్వంసం వివాదాస్పదంగా మారింది. సదరు కట్ట తమ పట్టా భూమిలో ఉందనే కారణంతో కొందరు వ్యక్తులు కట్టను ధ్వంసం చేసినట్లు సమాచారం. అంతే కాకుండా అక్కడ ఉన్న తాటి చెట్లను తొలగించారని స్థానిక గౌడ కులస్తులు ఎకై ్సజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎకై ్సజ్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ నజియాతో మాట్లాడగా తాను సెలవులో ఉన్నానని, కుంట కట్ట ధ్వంసం చేస్తున్నట్లు సమాచారం అందగానే సిబ్బందికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయించామన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేసిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ అధికారులు


