మరణించి.. మరికొందరి జీవితాల్లో వెలుగులు | - | Sakshi
Sakshi News home page

మరణించి.. మరికొందరి జీవితాల్లో వెలుగులు

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): ఓ మహిళ తాను చనిపోతూ మరి కొందరి జీవితాల్లో వెలుగులు నింపింది. వివరాలు ఇలా.. మండల పరిధిలోని గౌతాపూర్‌ గ్రామానికి చెందిన కుమ్మరి అనిత(38), తన భర్త అంజయ్య ఇద్దరు మెదక్‌డిపోలో ఆర్టీసీ కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా వారం క్రితం అనిత అధిక రక్తపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరిన ఆమె చికిత్స పొందుతూ, బ్రైయిన్‌ స్ట్రోక్‌తో శనివారం ఉదయం తుది శ్వాస విడిచింది. తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబసభ్యులు ఆమె అవయవాలను మరొకరి ప్రాణాలు కాపాడటానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం జీవన్‌దాన్‌కు అవయవదానం చేశారు. పుట్టెడు దుఃఖంలో సైతం అనిత కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయంపై, తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ మెదక్‌ డిపో కమిటీ హర్షం వ్యక్తం చేసింది. నిమ్స్‌ ఆసుపత్రి సిబ్బంది, పోస్ట్‌మార్టమ్‌ చేయించిన పోలీసులు, అనిత మృతదేహానికి నివాళులర్పించారు. అందరితో కలివిడిగా ఉండే అనిత మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement