తొగుట(దుబ్బాక): ఆత్మహత్యకు పాల్పడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని చందాపూర్‌లో చోటుచేసుకుంది. తొగుట ఎస్‌ఐ నవీన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుడ్డోజి కవిత(39) ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆమె భర్త సత్యాచారి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయానికి పెట్టుబడి, పిల్లల చదువులకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక కవిత ఈ నెల 1న ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మరణించినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


