నారాయణఖేడ్: ఖేడ్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చారి, పీడీ లక్ష్మీనారాయణ, పీఈటీ రవీందర్ తెలిపారు. హత్నూరలోని డా.బీఆర్ అంబేడ్కర్ కళాశాలలో నిర్వహించిన 12వ జోనల్ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వివిధ క్రీడాపోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఎంపికై న వారిలో అండర్ –14 విభాగంలో ఒకరు, అండర్ –17 విభాగంలో 13 మంది, అండర్ –19 విభాగంలో ఇద్దరు ఎంపికై నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎంపికైన వారిని పలువురు అభినందించారు.
ఖో–ఖో పోటీలకు విద్యార్థిని..
కొండపాక(గజ్వేల్): మండలంలోని సిర్సనగండ్ల హైస్కూల్‌కు చెందిన విద్యార్థినీ ఎర్రోళ్ల మనీషా రాష్ట్ర స్థాయి ఖో–ఖో పోటీలకు ఎంపికై ందని ఫిజికల్ డైరెక్టర్ ఉప్పలయ్య తెలిపారు. ఈనెల 6న సిద్దిపేటలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ –17 బాలికల విభాగం ఖో–ఖో పోటీల్లో ప్రతిభ చాటింది. తూంకుంటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుందని తెలిపారు.


