భర్త మద్యం తాగడం మానకపోవడంతో.. | - | Sakshi
Sakshi News home page

భర్త మద్యం తాగడం మానకపోవడంతో..

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

కొండపాక(గజ్వేల్‌): భర్త మద్యానికి బానిసవ్వడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కుకునూరుపల్లి పోలీస్టేషన్‌ పరిధిలోని కొడకండ్ల గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై బాలకృష్ణ కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని క్షుద్రంపల్లికి చెందిన రోహిత్‌సింగ్‌ నాలుగేళ్లుగా హాచరీస్‌ ఫాంలో కూలీ పనులు చేస్తున్నారు. కాగా నెల కింద అతడి బంధువులు లిల్లీరాయ్‌,అభిజిత్‌ రాయ్‌ దంపతులు ఇదే హాచరీస్‌కు పని కోసం వచ్చి అతడి గదిలో ఉంటున్నారు. భర్త అభిజిత్‌ రాయ్‌ మద్యానికి బానిసవ్వడంతో లిల్లీరాయ్‌(22) పలు మార్లు తాగొద్దని మందలించింది. అయినా మద్యం తాగడం మానకపోవడంతో మనస్తాపానికి గురై ఆమె ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని మృతి చెందింది. రోహిత్‌సింగ్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

అనారోగ్యంతో వృద్ధుడు..

చేర్యాల(సిద్దిపేట): పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ కేంద్రానికి చెందిన ముస్త్యాల మల్లయ్య(83) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మానసిక వేదనతో ఆయన శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆచూకీ కోసం వెతికే క్రమంలో పట్టణ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద మృతి చెంది ఉండటం గమనించారు. మృతుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అపూర్వరెడ్డి తెలిపారు.

భార్య ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement