జల్సాలకు అలవాటై బైకులు చోరీ | - | Sakshi
Sakshi News home page

జల్సాలకు అలవాటై బైకులు చోరీ

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

● ముగ్గురు అరెస్ట్‌

● 6 ద్విచక్ర వాహనాల స్వాధీనం

రామచంద్రాపురం(పటాన్‌చెరు): జల్సాలకు అలవాటై ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌ కేసు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి పరిధిలోని ఇంద్రానగర్‌ కాలనీలో నివాసముండే సర్పరాజ్‌, మహమ్మద్‌ గౌస్‌, సయ్యద్‌ ముస్తఫాలు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైక్‌ చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేయకుండా వదిలేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి అపరిస్తున్నారు. ఈ క్రమంలో చోరీ చేసిన వాహనాలను బెల్‌ కాలనీ సమీపంలో దాచిపెట్టి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో క్రైం సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన 6బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రామచంద్రాపురం, పటాన్‌చెరు, సంగారెడ్డి, రాజేందర్‌నగర్‌, ఆర్‌జీఐ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌ లాల్‌ నాయక్‌, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకార్‌ బాబు, హెడ్‌ కానిస్టేబుల్‌ గోపీకృష్ణ రెడ్డి, కానిస్టేబుల్స్‌ ప్రకాశ్‌, శ్రీనివాస్‌, మహేశ్‌, రవిలను ఏసీపీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement