బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని తోటపల్లి పీహెచ్‌సీని జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌ఓ) ధన్‌రాజ్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ల్యాబ్, ఫార్మసీ స్టోర్‌ను పరిశీలించారు. ఆరోగ్య కార్యక్రమాల రికార్డులు తనిఖీ చేసి వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోగులకు వైద్య సేవలు అందించడంతో పాటు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కృష్ణతేజ, శ్రీనివాస్, మధు, వాణి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
హైకోర్టు ఆదేశాలతో బ్రేక్
సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని చికెన్, మటన్, చేపల విక్రయ దుకాణాల నుంచి వేస్టేజ్‌కు సంబంధించి నిర్వహించాల్సిన బహిరంగ వేలం ప్రక్రియ రద్దయింది. హైదరాబాద్ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో పురపాలక సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించాల్సిన బహిరంగ వేలం ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కోర్టు ఆదేశాలతో వేలం నిలిపివేయడం ప్రజలకు, సంబంధిత వ్యాపారులకు ఊరట కలిగించింది.


