హత్నూర(సంగారెడ్డి): పంటలు ఎండి రైతులు అరిగోస పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని ఎలిగేగుట్ట తండా, భీమ్లా, దేవుని గుట్ట తండా, సిరిపురం, నస్తీపూర్ గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటలను ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్‌తో కలిసి పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈసందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వరి కోతలు ప్రారంభమైన ఈ సమయంలో సర్వే నిర్వహించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ఎండిన పంటలు పశువుల మేతగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతు బీమా, భరోసా, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం రైతులతో మాట్లాడి ఎంత పెట్టుబడి పెట్టారు.. ఎంత పంట ఎండిపోయింది.. అప్పు ఎలా తీరుస్తారంటూ అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన వరి పంట ఎకరాకు రూ. 30 వేల చొప్పున చెల్లించాలన్నారు. కేసీఆర్ హయాంలోనే రైతులకు మేలు జరిగిందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ ఎంపీపీలు నర్సింలు, ఆంజనేయులు, హరికృష్ణ, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రమణగౌడ్, సర్పంచ్‌లు ప్రమీల, నవీన్‌గౌడ్, మధు, శోభారాణి, ఎల్లయ్య, మల్లేశం, నాయకులు దామోదర్‌రెడ్డి, నరసింహారెడ్డి, మధు, రవి, మహేందర్, స్వామి, దశరథ, అజ్జు, ఇబ్రహీం, అర్జున్, కృష్ణతో పాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
హత్నూర మండలంలో ఎండిన పంటల పరిశీలన


