ముందు ఎమ్మెల్యేగా గెలువు | - | Sakshi
Sakshi News home page

ముందు ఎమ్మెల్యేగా గెలువు

Nov 7 2026 10:11 AM | Updated on Nov 7 2026 10:11 AM

సదాశివపేట(సంగారెడ్డి): రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడం కాదు, జగ్గారెడ్డి ముందు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలవాలని ఎంపీ రఘునందన్‌ సవాల్‌ విసిరారు. శుక్రవారం సదాశివపేటలో జరిగిన మెగా జాబ్‌మేళాకు హాజరైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఉన్న మొత్తం ఎంపీ స్థానాలు, రాబోయే డీలిమిటేషన్‌ ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితిని ముందుగా చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో మళ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో తెలియదన్నారు. సింగూర్‌ నుంచి 25 టీఎంసీలు కిందకు వదిలి ఏడాది కాలంగా మరమ్మతులు చేయకపోతే నోరు మూసుకుని కూర్చున్న కాంగ్రెస్‌ పెద్దలను సదాశివపేట, సంగారెడ్డి ప్రజలు అడుగుతున్నారని విమర్శించారు. మూడు టీఎంసీలు మాత్రమే సింగూర్‌ ప్రాజెక్టులో ఉన్నాయని, కిందకు వదలడం ఆపి మెదక్‌ జిల్లాకు తాగునీరు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. రాహుల్‌గాంధీ ప్రధాని అని కలలోనే కాంగ్రెస్‌ నాయకులు జీవించడం ఖాయమని ఎద్దేవా చేశారు. డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా జాబ్‌ మేళాలో 22 కంపెనీలు పాల్గొనగా, 400 మంది నిరుద్యోగులు హజరయ్యారు. 191 మంది నిరుద్యోగులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శివాజీ, బీజేపీ మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ కోవూరి సంగమేశ్వర్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, పట్టణ అధ్యక్షురాలు రాజేశ్వరీ, నాయకులు తోట చంద్రశేఖర్‌, మాణిక్‌రావు తదితరులు పాల్గొన్నారు.

జగ్గారెడ్డికి ఎంపీ రఘునందన్‌ కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement