పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం

Nov 7 2026 10:11 AM | Updated on Nov 7 2026 10:11 AM

పటాన్‌చెరు: వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ పర్యావరణ పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలని విద్యావేత్తలు సూచించారు. పటాన్‌చెరులోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఐసీఎస్‌ఎస్‌ఆర్‌, రూసా నిధులతో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ‘వాతావరణ అంశాలు, విధానం, శాస్త్రం, మానవాళి భవిష్యత్తు’ అనే అంశంపై మూడు సాంకేతిక సమావేశాలు నిర్వహించారు. వాతావరణ మార్పుల తీవ్రత, వాటి ప్రభావాలు, పర్యావరణహిత చర్యలు, హరిత భారత నిర్మాణంపై పలువురు విద్యావేత్తలు అవగాహన కల్పించారు. జేఎన్‌యూ ప్రొఫెసర్‌ శిరీష, ఓయూ ప్రొఫెసర్లు, ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ సుబ్ర హ్మణ్యం తదితరులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement