బైకును తగులబెట్టిన బాలురు
కౌడిపల్లి(నర్సాపూర్): పెట్రోల్ అయిపోయిందని బాలురు బైకును తగులబెట్టారు. ఈ ఘటన మండలంలోని మహమ్మద్‌నగర్ ముండ్రాయిగేట్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఐడీపీఎల్‌కు చెందిన రెండు బైక్‌లపై ఐదుగురు బాలురు ఏడుపాయలకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. కాగా ముండ్రాయిగేట్ సమీపంలోకి రాగానే ఒక బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో మరోబైక్‌పై ఉన్న యువకులకు ఫోన్‌చేసి పెట్రోల్ తెమ్మని చెప్పా రు. పెట్రోల్ పోసినా బైక్ స్టార్ట్ కాలేదు. దీంతో పెట్రోల్‌తో బైకును తగులబెట్టారు. ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్లగా మరో ఇద్దరు అక్కడే ఉన్నారు. స్థానికులు ఆరా తీయగా జరిగిన విషయం చెప్పారు. కాగా ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా.. విచారణ చేస్తున్నామని, ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.


