56 సెల్‌ఫోన్‌ల రికవరీ | - | Sakshi
Sakshi News home page

56 సెల్‌ఫోన్‌ల రికవరీ

Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM

56 సెల్‌ఫోన్‌ల రికవరీ

సిద్దిపేటకమాన్‌: పలువురు పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను నూతన టెక్నాలజీ సాయంతో పోలీసులు గుర్తించి బాధితులకు అందజేసినట్లు సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పలువురు తమ సెల్‌ఫోన్లు పొగొట్టుకున్నట్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. సీఈఐఆర్‌ పోర్టల్‌ నూతన టెక్నాలజీ సాయంతో పోలీసులు సెల్‌ఫోన్లను గుర్తించి కమిషనరేట్‌లో బాధితులకు అందజేసినట్లు తెలిపారు. నెల రోజుల్లో సుమారు రూ.10లక్షల విలువైన 56 సెల్‌ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కుశాల్కర్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement