గంజాయి పట్టివేత.. | - | Sakshi
Sakshi News home page

గంజాయి పట్టివేత..

Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM

గంజాయి పట్టివేత..

రామచంద్రాపురం(పటాన్‌చెరు): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తెల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన ఇర్ఫాన్‌ అలాం, అజరుద్దీన్‌ అన్సారీ కలిసి ఈనెల 2వ తేదీన బీహార్‌ సరిహద్దు ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి రెండు కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. కాగా వారు నివాసం ఉంటున్న తెల్లాపూర్‌ పరిధిలోని జేపీ కాలనీకి తీసుకొచ్చారు. శుక్రవారం సాయంత్రం ఓ లేబర్‌ క్యాంపు వద్ద విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని, రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 1.904 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement