రక్తహీనతతో జర భద్రం | - | Sakshi
Sakshi News home page

రక్తహీనతతో జర భద్రం

Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM

గర్భిణుల్లో పెరుగుతున్న వ్యాధి

● పోషకాహార లోపమే ప్రధాన కారణం

● తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి

● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

సిద్దిపేటకమాన్‌: యుక్త వయసు బాలికలు, గర్భిణులు రక్తహీనత (ఎనీమియా)తో బాధపడుతున్నారు. 15 నుంచి 49ఏళ్ల వయసు గల మహిళలు, గర్భిణులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్నారు. రక్తహీనత ఇటీవలి కాలంలో గర్భిణులను వేధిస్తున్న ప్రధాన సమస్య. పోషకాహారం తగిన మోతాదులో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. మనం రోజు తీసుకునే ఆహారపు అలవాట్లలో మార్పులు, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య తీవ్రమవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే గర్భిణులు సరైన సమయంలో పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

వైద్య పరీక్షలు తప్పనిసరి

మాతృత్వం మహిళలకు ఓ వరం. తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురు కాకుండా ఉండాలన్నా, పుట్టబోయే బిడ్డ శారీరకంగా, మానసికంగా ఎదుగుదల సరిగా ఉండాలన్నా, ప్రసవానంతరం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నా రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగినంత ఉండాలి. అప్పుడే తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అనుబంధ జనరల్‌ ఆస్పత్రి, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు, డెలివరీ కోసం వచ్చే గర్భిణుల్లో చాలా మందికి రక్తహీనత సమస్య ఉన్నట్లు వైద్యులు పేర్కొటున్నారు. సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో గైనకాలజీ విభాగంలో ప్రతిరోజు ఓపీ విభాగంలో 400మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల సుమారు 500మందికి పైగా ప్రసవం కోసం ఆస్పత్రికి వస్తుంటారు. వీరిలో 30శాతం మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఈ సమస్య ఉన్నవారు ప్రసవానంతరం త్వరగా అలసిపోవడం, ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తహీనత సమస్యను అధిగమించాలంటే గర్భిణులు సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ప్రతి రోజు రాత్రి 8గంటలు, మధ్యాహ్నం రెండు గంటలు నిద్రపోవాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కోడిగుడ్లు, క్యారెట్‌, బీట్‌రూట్‌, దానిమ్మ, అంజీర్‌, బెల్లంతో తయారు చేసినవి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement