మెదక్‌జోన్: మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని షీటీం, భరోసా కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షీ టీం పనితీరు, ఇప్పటివరకు నమోదు చేసిన కేసులు, అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. మహిళలు, బాలికలను వేధించే ఆకతాయిలపై నిరంతరం నిఘా ఉంచాలని, బస్టాండ్లు, కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థల్లో మహిళల భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం భరోసా కేంద్రాన్ని సందర్శించి బాధితులకు అందిస్తున్న సేవలు, కౌన్సెలింగ్, ఫిర్యాదుల పరిష్కార విధానాలను పరిశీలించారు. ఈ తనిఖీలో భరోసా ఎస్‌ఐ సుచరిత, కోఆర్డినేటర్ సౌమ్య, భరోసా, షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్


