● ముస్తాబైన బంగారం దుకాణాలు
● షాపులలో ప్రత్యేక ఆఫర్లు
సాక్షి, సిద్దిపేట: దీపావళి పండుగకు ముందు అశ్వాయుజ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే త్రయోదశిని ధన త్రయోదశి(ధన్ తెరాస్)గా వ్యవహరిస్తారు. నేడు ధన త్రయోదశి...లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని ధన్ త్రయోదశి కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తే మంచిదని, లక్ష్మీదేవి రాకతో సిరి సంపదలు, సుఖశాంతులతో తులతూగుతామనేది ప్రజల విశ్వాసం. అందుకే ఈ రోజున బంగారం కొనుగోలు చేయడాన్ని చాలామంది ఆనవాయితీగా భావిస్తారు. అక్షయ తృతీయ, ధన త్రయోదశి రోజుల్లో ప్రతీ ఒక్క,రు బంగారం కొనుగోలు చేస్తారు. అందుకనుగుణంగా బంగారు నగల దుకాణాలు ముస్తాబయ్యాయి. ముందస్తుగా వందలాది రకాల ఆభరణాలు అందుబాటులో ఉంచి కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి.
ధరలు పెరిగినా
బంగారం ధరలు పెరిగినా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ధన్ తెరాస్ను దృష్టిలో ఉంచుకుని అర గ్రాము నుంచి 5 గ్రాముల కాయిన్లను అందుబాటులో ఉంచారు. ధన్ తెరాస్ను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే పలు ఆభరణాలు బుక్ చేసుకుని అడ్వాన్స్‌లు సైతం ఇచ్చారు. ధన్‌తెరాస్ రోజున ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.


