అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

Nov 6 2026 11:21 AM | Updated on Nov 6 2026 11:21 AM

పటాన్‌చెరు టౌన్‌: పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని సరిహద్దు దాటించి అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును ఎస్‌ఓటీ, పటాన్‌చెరు పోలీసులు రట్టు చేశారు. పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం తెల్లవారుజామున నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో భారీగా రేషన్‌ బియ్యం పట్టుబడింది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ ప్రాంతం నుంచి కర్ణాటక రాష్ట్రానికి రేషన్‌ బియ్యాన్ని లారీలో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఓటీ అధికారులతో కలిసి పటాన్‌చెరు పోలీసులు జాతీయ రహదారి శివారులో నిఘా ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన లారీని నిలిపి తనిఖీ చేయగా, అందులో అక్రమంగా లోడ్‌ చేసిన 23.2 టన్నుల పీడీఎస్‌ రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న ప్రదీప్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement