వ్యవసాయ విద్యకు
క్షేత్రస్థాయి పరిశీలనే కీలకం
కావేరి వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్‌రావు
వర్గల్(గజ్వేల్): వ్యవసాయ విద్యను క్షేత్రస్థాయి అనుభవాలతో అనుసంధానిస్తే అది రైతుల అభ్యున్నతి, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతుందని సిద్దిపేట జిల్లా గౌరారం కావేరి వర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. వర్సిటీలో గురువారం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో రైతులు–విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వర్సిటీ వ్యవసాయ క్షేత్రాలను రైతులు సందర్శించారు. ఆధునిక సాగు పద్ధతులు, పరిశోధన కార్యక్రమాలను పరిశీలించారు. కావేరి సీడ్స్ పరిశ్రమలో విత్తనాల ఉత్పత్తి, శుద్ధి, ప్రాసెసింగ్, నాణ్యత ప్రమాణాలపై అవగాహన పొందారు. అనంతరం ముఖాముఖి సమావేశంలో సాగులో ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్రస్థాయి అనుభవాలను రైతులు విద్యార్థులతో పంచుకున్నారు. వారికి విద్యార్థులు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, శాసీ్త్రయ సాగు పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ...తరగతి గది విజ్ఞానానికి క్షేత్రస్థాయి అనుభవాన్ని జోడించడమే వర్సిటీ లక్ష్యమన్నారు. రైతులు, విద్యార్థులు, విద్యాసంస్థలు, వ్యవసాయ పరిశ్రమల మధ్య సమన్వయం, వ్యవసాయ రంగాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ జి.పుష్పలత, ప్రొఫెసర్ పి.సురేందర్‌బాబు పాల్గొన్నారు.


