అక్రమ నిర్మాణాల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల తొలగింపు

Nov 6 2026 11:21 AM | Updated on Nov 6 2026 11:21 AM

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): కోహెడ మండల కేంద్రంలోని బాడుగుల చెరువుకట్ట కింద గల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు గురువారం తొలగించారు. బడుగుల చెరువు కింద సర్వే నంబర్‌ 1227లో తహసీల్దార్‌ నవీన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించారు. అనంతరం సదరు భూమిలో అక్రమంగా నిర్మించిన కోహెడకు చెందిన పొన్నాల భూపతి ఫంక్షన్‌హాల్‌లోని కొంతభాగంతోపాటు కోహెడ 01వ వార్డు బీజేపీ సభ్యుడు కట్ట ప్రవీణ్‌ నిర్మిస్తున్న ఇంటిని జేసీబీ సహాయంతో తొలగించే చర్యలు చేపట్టారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నియోజకవర్గ నాయకుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి ఖమ్మం వెంకటేశం, నాయకులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కట్ట ప్రవీణ్‌కు ఇంటి స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విధంగా హామీ ఇవ్వాలని తహసీల్దార్‌, సర్పంచ్‌లను డిమాండ్‌ చేశారు. అలాగే బీజేపీ వార్డు సభ్యుడు కట్ట ప్రవీణ్‌ ఇంటిని మాత్రమే కూల్చివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ భూమిలో ఉన్న మిగతా అక్రమ నిర్మాణాలను కూడా తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement