నిరంతర తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

నిరంతర తనిఖీలు

Nov 6 2026 11:21 AM | Updated on Nov 6 2026 11:21 AM

రంగంలోకి పౌర సరఫరాల శాఖ

సిద్దిపేటరూరల్‌: బియ్యం దుకాణాల్లో 26 కిలోల బస్తా తూకం వేస్తే 24 కిలోలు మాత్రమే వస్తుందంటూ ‘సాక్షి’ దినపత్రికలో ‘బియ్యం మాయం’శీర్షికతో బుధవారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌర సరఫరాల శాఖ స్పందించింది. ఈ సందర్భంగా డీసీఎస్‌ఓ బ్రహ్మరావు మేరకు జిల్లాలో తక్కువ తూకం..అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నారనే వార్త పత్రికలో వచ్చిన ప్రచురణకు స్పందనగా బియ్యం మిల్లులు, హోల్‌సేల్‌, రిటైల్‌ బియ్యం వ్యాపార కేంద్రాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధరలకే వినియోగదారులకు బియ్యం విక్రయించేలా చూడాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు. కలెక్టర్‌, జిల్లా పౌర సరఫరాలశాఖ, లీగల్‌ మెట్రాలజీ శాఖ అధికారులతోపాటు జీఎస్టీ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులతో కూడిన తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారని, ఇప్పటివరకు మొత్తం 27 తనిఖీలు నిర్వహించగా, అక్రమాలకు పాల్పడిన 5 వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు బియ్యం విక్రయించాలని సూచించారు. ప్యాకింగ్‌ చేసిన బియ్యం బస్తాల వాస్తవ బరువును ధృవీకరించడం, విక్రయ ధరలను పర్యవేక్షించడం, ప్రజలకు సరసమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉండేలా చూడడానికి ప్రతీ రోజు తనిఖీలు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement