అండర్‌–17 బాస్కెట్‌బాల్‌ జట్టుకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అండర్‌–17 బాస్కెట్‌బాల్‌ జట్టుకు ఎంపిక

Nov 5 2026 8:50 AM | Updated on Nov 5 2026 8:50 AM

పటాన్‌చెరు టౌన్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లా అండర్‌– 17 బాస్కెట్‌బాల్‌ జట్టుకు పటాన్‌చెరు సెయింట్‌ జోసెఫ్‌ హైస్కూ ల్‌ విద్యార్థులు హరిణి, అర్వన్‌ ఎంపికయ్యారు. జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టులో చోటు సంపాదించారు. ఈ సందర్భంగా బుధవారం కోచ్‌ షేక్‌ అక్బర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఈ విజయాన్ని సాధించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

ఓటు చోరీతోనే

బీజేపీకి అధికారం

పటాన్‌చెరు టౌన్‌: రాహుల్‌గాంధీ ప్రధాని కాలేరని అమిత్‌షా వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి విమర్శించారు. బుధవారం పట్టణ కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా 2 కోట్ల ఉద్యోగా లు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల జమ వంటి హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఓటు చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. భారత్‌ జోడో యాత్రతో రాహుల్‌గాంధీ ప్రజల ప్రేమాభిమానాలను పొందారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు, యువత, కార్మి కులు అండగా నిలుస్తారని అన్నారు. సమావేశంలో నాయకులు సంజీవరెడ్డి, మతిన్‌, యువరాజ్‌, సాయిలు పాల్గొన్నారు.

మహిళా సంఘాల బలోపేతం

హత్నూర(సంగారెడ్డి): గ్రామాల్లో వీఓఏలు మహిళా సమాఖ్య సంఘాల బలోపేతానికి కృషి చేయాలని ఐకేపీ డీపీఎం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండలంలోని ఐకేపీ కార్యాలయంలో గుమ్మడిదల, పటాన్‌చెరు, హత్నూర మండలాలకు సంబంధించిన వీఓఏ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీపీఎం మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా రాయాలని సూచించారు. రుణాలు ప్రతీ నెల సక్రమంగా చెల్లించేలా వీఓఏలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎంలు రాజశేఖర్‌, శివకుమార్‌, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థుల సత్తా

జహీరాబాద్‌: జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పట్టణానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. చైన్నెలో ఈనెల 2న నిర్వహించిన 25వ జూనియర్‌ జాతీయ వుషూ ఛాంపియన్‌షి ప్‌–2026లో శ్లోక్‌ సాగర్‌, ఉమా మహేశ్వరీ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. శ్లోక్‌ సాగర్‌ 6.98 పాయింట్లు, ఉమా మహేశ్వరి 6.86 పాయింట్లు సాధించి ప్రతిభ కనబరిచారు. వజ్ర వీరమార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ మాస్టర్లు శంకర్‌ సాగర్‌, సిధారెడ్డి, కోచ్‌ సంధ్య చౌహాన్‌ అభినందించారు.

దరఖాస్తుల ఆహ్వానం

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పలు పోస్టులు భర్తీ చేయనున్నట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మేనేజర్‌, కో ఆర్డినేటర్‌, సోషల్‌ వర్క్‌, సోషియాలజీ, సైకాలజీ, సోషల్‌ వర్కర్‌, డాక్డర్‌, నర్స్‌, ఆయా, సెక్యూరిటీ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఈనెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం, దరఖాస్తు ఫారం కోసం కలెక్టరేట్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement