పంట రుణాల రీ షెడ్యూల్‌ | - | Sakshi
Sakshi News home page

పంట రుణాల రీ షెడ్యూల్‌

Nov 5 2026 8:50 AM | Updated on Nov 5 2026 8:50 AM

కలెక్టరేట్‌ ఏఓ విజయలక్ష్మి

కలెక్టరేట్‌ ఏఓ విజయలక్ష్మి

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: జిల్లాలో కరువు ప్రభావిత రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అర్హులైన రైతుల పంట రుణాల రీ షెడ్యూల్‌కు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టరేట్‌ ఏఓ విజయలక్ష్మి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సుధీర్‌ కుమార్‌ బ్యాంకు అధికారులకు సూచించారు. బుధవారం కలెక్ట రేట్‌లో ఖరీఫ్‌–2026 కరువు సహాయక చర్యల్లో భాగంగా ప్రత్యేక డీసీసీ, డీఎల్‌ఆర్‌ఎల్‌ సమావే శం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌ ఏఓ మాట్లాడుతూ.. ఆర్బీఐ మార్గదర్శకాలు, సంబంధిత బ్యాంకుల నిబంధనలకు అనుగుణంగా అర్హులైన రైతులకు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన రైతుల వివరాలను సక్రమంగా సేకరించి నమోదు చేయాలన్నారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సుధీర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రెండు త్రైమాసికాల్లో జిల్లాలోని బ్యాంకులు 1,20,065 ఖాతాల ద్వారా రూ.2,520.18 కోట్ల పంట రుణాలను రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని మొత్తం 28 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించగా, వాటిలో రెండు మండలాలు తీవ్ర కరువు ప్రభావిత మండలాలుగా, 26 మండలాలు మోస్తరు కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించినట్లు వివరించారు. అయితే పంట రుణాల పునర్వ్యవస్థీకరణ అనేది రుణమాఫీ పథకం కాదని, అర్హులైన రైతులకు రుణ చెల్లింపులో వెసులుబాటు కల్పించే ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్‌డీఓ ప్రదీప్‌ చంద్ర, నాబార్డ్‌ ఏజీఎం కృష్ణ తేజ, వ్యవసాయ శాఖ అదనపు డీఏ శ్రీదేవి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

»»

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement