శివ్వంపేట(నర్సాపూర్): ఇరవై ఏళ్ల నుంచి ఉన్న విద్యుత్ సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో ప్రమాద భరితంగా నివాస గృహాల వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు 11 కేవీ విద్యుత్ లైన్ మూలంగా పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కాగా విద్యుత్ షాక్‌తో ఐదేళ్ల కిత్రం మేసీ్త్ర , రెండు నెలల క్రితం ఎల్లయ్య మృతి చెందాడు. విద్యుత్ లైన్‌ను మార్చాలని మీడియాలో కథనాలు, ప్రతినిధులు, గ్రామస్తుల ఒత్తిడితో విద్యుత్ అధికారులు స్పందించారు. కాగా ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్తు లైన్‌ను తొలగించి మరో మార్గం ద్వారా ఏర్పాటు చేశారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి బుధవారం ప్రారంభించారు. విద్యుత్ సమస్య పరిష్కారం కావడంతో సర్పంచ్ మమత, ఉప సర్పంచ్ సత్యనారాయణ, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యుత్ సిబ్బందిని సన్మానించారు.
ప్రమాదభరిత విద్యుత్ లైన్ తొలగింపు


