పాతూరులో విషాదం | - | Sakshi
Sakshi News home page

పాతూరులో విషాదం

Nov 5 2026 8:44 AM | Updated on Nov 5 2026 8:44 AM

పాతూరులో విషాదం

వర్గల్‌(గజ్వేల్‌): చక్కగా చదువుకుని ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు కానరాని తీరాలకు చేరాడు. బలవన్మరణంతో కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. బుధవారం వర్గల్‌ హాస్టల్‌ గదిలో పైకప్పునకు ఉరేసుకుని టెన్త్‌ విద్యార్థి ఆరె రామ్‌చరణ్‌ ఆత్మహత్య చేసుకోవడంతో పుత్రశోకంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మర్కూక్‌ మండలం పాతూరుకు చెందిన చిన్న మల్లేశం, లింగమ్మ దంపతులకు గణేష్‌, రామ్‌చరణ్‌ అనే కుమారులున్నారు. కూలీనాలీ పనులతో కాలం వెల్లదీస్తున్న ఆ దంపతులు రామ్‌చరణ్‌ను వర్గల్‌ హాస్టల్‌లో చేర్పించి అక్కడి జెడ్పీహైస్కూల్‌లో పదోతరగతి చదివిస్తున్నారు. బుధవారం హోంవర్క్‌ విషయంలో స్కూల్‌లో ఉపాధ్యాయుడు రామ్‌చరణ్‌ను మందలించడంతో హాస్టల్‌ గదికి చేరుకుని, తండ్రితో ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తరువాత కొన్నిగంటల వ్యవధిలోనే హాస్టల్‌ గదిలో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుని మృతదేహం వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement