టపాసులు కాలుస్తున్నారా? | - | Sakshi
Sakshi News home page

టపాసులు కాలుస్తున్నారా?

Nov 5 2026 8:44 AM | Updated on Nov 5 2026 8:44 AM

టపాసులు కాలుస్తున్నారా?

దీపావళి పండుగ వేళ జాగ్రత్తలు తప్పనిసరి..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అజాగ్రత్త వద్దు..

పిల్లలను దూరంగా ఉంచాలి

సంగారెడ్డి క్రైమ్‌: దీపావళి పండుగ వేళ పెద్దల కంటే పిల్లల సందడే ఎక్కువ. టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బాణసంచా కాల్చే సమయంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి కారణాలవల్ల ప్రతి సంవత్సరం అనేకమంది ప్రమాదాలకు గురవుతున్నారు. జిల్లాలో కంటి చూపు కోల్పోయిన సందర్భాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షించాలి.

బహిరంగ ప్రదేశాలు, ఆరు బయట మాత్రమే కాల్చాలి

పిల్లలు కాల్చే సమయంలో పెద్దలు పక్కనే ఉండాలి

గ్యాస్‌ సిలిండర్లు, మండే పదార్థాలకు టపాసులు దూరంగా ఉంచాలి.

ఇంట్లో, మేడపై కాల్చడానికి ప్రయత్నించవద్దు. బహిరంగ ప్రదేశాలు, ఆరు బయట మాత్రమే కాల్చాలి.

ఒక వేళ అగ్ని ప్రమాదాలు జరిగితే మంటలు ఆర్పేందుకు బకెట్‌లో నీళ్లను పక్కన పెట్టుకోవాలి.

నిప్పురవ్వలు దుస్తులపై పడి వ్యాపించకుండా ఉండేందుకు కాటన్‌న్‌ దుస్తులు ధరించాలి.

చిన్నచిన్న గాయాలైనప్పుడు సెప్టిక్‌ కాకుండా ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్టు అందుబాటులో ఉంచుకోవాలి.

పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు పక్కనే ఉండటం శ్రేయస్కరం.

ఇవి తప్పనిసరి..

టపాసులను ఒకసారి అంటించిన తర్వాత వెలగలేదని వెంటనే దగ్గరకు వెళ్లొద్దు. కొన్నిసార్లు పేలే ప్రమాదం ఉంటుంది.

ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. నిప్పు రవ్వలు పూరి గుడిసెలు, గడ్డివాములపైకి దూసుకెళ్లి అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి.

చుడీదార్‌ వేసుకునేవారు వదులుగా ఉన్నవి కాకుండా బిగుతుగా ఉండేవి వేసుకోవాలి.

పర్యావరణ హితమెన వాటిని కాల్చితే మంచిది.

టపాసులు కాల్చేటప్పడు ఏ మాత్రం అశ్రద్ధ వహించొద్దు. ముఖ్యంగా పిల్లలు టపాసులు కాల్చేటప్పడు తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. ప్రమాదాల బారిన పడకుండా పండుగను ఆనందంగా జరుపుకోవాలి.

– సందేశ్‌కుమార్‌, జిల్లా అగ్నిమాపక అధికారి

చిన్నపిల్లలను టపాసులకు దూరంగా ఉంచడం మంచిది. చేతులతో పట్టుకొని టపాసులు పేల్చటం ప్రమాదకరం. కాలిన గాయాలపై బర్నర్‌ రాయాలి. భారీ టపాసులు కాల్చటం వల్ల పొగతో శ్వాసకోశ సమస్యలు, వినికిడి ఇబ్బందులు వస్తాయి. గర్భిణులు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి మంటలు అంటుకుంటే మంటలను అదుపుచేసి కాలిన గాయాలను నీటితో శుభ్రం చేసి వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి.

– సువర్ణ రెడ్డి, వైద్యురాలు, సంగారెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement