ధాన్యం బస్తాల వద్దకు వెళ్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

ధాన్యం బస్తాల వద్దకు వెళ్తుండగా..

Nov 5 2026 8:44 AM | Updated on Nov 5 2026 8:44 AM

ధాన్యం బస్తాల వద్దకు వెళ్తుండగా..

హవేళిఘణాపూర్‌(మెదక్‌): రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందాడు. వివరాలు ఇలా.. మెదక్‌ పట్టణ శివారులోని ఔరంగాబాద్‌కు చెందిన రైతు తిరుపతి కిషన్‌(61) తనకున్న రెండెకరాల్లో పండించిన వరి ధాన్యంను మంగళవారం లెప్రసీ దవాఖాన వద్ద తూకం వేశారు. రాత్రి రైతు బస్తాల వద్ద కాపలా ఉండేందుకు ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మెదక్‌–బోధన్‌ జాతీయ రహదారి ఔరంగాబాద్‌ గేటు వద్ద రోడ్డు దాటగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో రైతు తిరుపతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని అంబులెన్సులో మెదక్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మెదక్‌ టౌన్‌ సీఐ మహేశ్‌ తెలిపారు. మృతునికి భార్య భారతి, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇదిలా ఉండగా కిషన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో కరెంటు లేదని, సరైన చికిత్స అందకపోవడంతోనే మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపించారు.

బైక్‌ అదుపుతప్పి వ్యక్తి..

సంగారెడ్డి : బైక్‌ అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఉమ్మడి పుల్కల్‌ మండల పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పుల్కల్‌ ఎస్‌ఐ విశ్వజన్‌ వివరాల ప్రకారం.. మండలంలోని ముదిమాణిక్యం గ్రామానికి చెందిన అక్సాన్‌పల్లి శ్రీనివాస్‌ (50) వత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముంగించుకొని తన బైక్‌పై సంగారెడ్డి నుంచి వస్తుండగా ప్రమాదవశాత్తు శివంపేట శివారులో బైక్‌ అదుపుతప్పి స్కిడ్‌ కావడంతో కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో అంబులెనన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

బస్సు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు..

చేగుంట(తూప్రాన్‌): బస్సు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన మాసాయిపేట మండల పరిధిలో జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పోతాన్‌శెట్టిపల్లి తండాకు చెందిన ధరావత్‌ స్వామి(63) టీవీఎస్‌ మోపెడ్‌పై చేగుంటకు వచ్చి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రామంతపూర్‌ శివారులోకి రాగానే వెనుక నుంచి వస్తున్న ట్రావెల్స్‌ బస్సు మోపెడ్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలైన స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

కారు ఢీకొట్టడంతో రైతు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement