మద్దూరు(హుస్నాబాద్): సీ్త్రనిధి రుణాల బకాయిలను వెంటనే చెల్లించాలని సీ్త్రనిధి సిద్దిపేట జిల్లా రీజినల్ మేనేజర్ దూదిపాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మద్దూరు జాగృతి మండల సమాఖ్య కార్యాలయంలో వీవోఏలతో సీ్త్రనిధి రుణాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. మారుమూల మండలమైన మద్దూరులో సీ్త్రనిధి రుణాల వసూళ్లు సరిగా లేవన్నారు. గతంలో మహిళా సంఘాలకు రూ.3కోట్ల నిధులు మంజూరు చేయగా అందులో కేవలం రూ.70లక్షలు మాత్రమే వసూలయ్యాయని తెలిపారు. మిగతా 2.30కోట్ల నిధుల బకాయిలు ఉన్నాయని చెప్పారు. రుణాల రికవరీ కాకపోవడంతో చాలా సంఘాలకు తిరిగి రుణాలు మంజూరు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. రుణాల రికవరీ కోసం మండల స్థాయి ప్రత్యేకంగా కమిటీలు వేసి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మద్దూరు మండలానికి రూ.కోటి సీ్త్రనిధి రుణాలు మంజూరయ్యాన్నారు. అర్హత కల్గిన సంఘాల సభ్యులకే ఈ రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రకాశం, సీసీలు తదితరులు పాల్గొన్నారు.
రీజినల్ మేనేజర్ మోహన్‌రెడ్డి


