కాశీపూర్‌లో యూనిసెఫ్‌ బృందం | - | Sakshi
Sakshi News home page

కాశీపూర్‌లో యూనిసెఫ్‌ బృందం

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

కంది(సంగారెడ్డి): స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో గ్రామీణ వ్యర్థాల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు ఎంపికై న కంది మండలంలోని కాశీపూర్‌లో మంగళవారం యూనిసెఫ్‌– ఐఐఎం ఇండోర్‌ అధికారుల బృందం పర్యటించింది. ఐఐఎం ఇండోర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్లు బాలాజీ, ఆదిత్య పాటిదర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ వార్డు సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లతో సమావేశమై పంచాయతీల్లో చెత్త సేకరణ పారిశుద్ధ్య నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, విద్యా, వ్యాపార, ఇతర సంస్థల నుంచి ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల పరిమాణాన్ని శాసీ్త్రయ పద్ధతుల్లో అంచనా వేయ డం ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశమన్నారు. కాశీపూర్‌లో ఏడు రోజులపాటు సమగ్ర క్షేత్ర స్థాయి అధ్యయనం నిర్వహించనున్నట్లు వెల్ల డించారు. ఈ అధ్యయనానికి గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కృష్ణగౌడ్‌, పంచాయతీ కార్యదర్శి రమేశ్‌తోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఖైదీలకు చట్టాలపై

అవగాహన తప్పనిసరి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

కార్యదర్శి సౌజన్య

సంగారెడ్డి టౌన్‌: ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. కంది సెంట్రల్‌ జైలులో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఖైదీలకు ఉచిత న్యాయ సహా యం అందుబాటులో ఉందన్నారు. జైలులోని వివిధ విభాగాలను సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. వారికి అందుతున్న ఆహారం, వైద్యం, తాగునీటి తదితర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జైలు అధికారులు, న్యాయవాదులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కబడ్డీ పోటీలకు

ఎంపికై న విద్యార్థులు

పాపన్నపేట(మెదక్‌): పీఎంశ్రీ పాఠశాలల అండర్‌–17 విభాగం కబడ్డీ పోటీలలో పాపన్నపేట విద్యార్థినులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. మెదక్‌లో మంగళవారం జరిగిన పోటీల్లో మొత్తం 24 జట్లు పాల్గొనగా పాపన్నపేటకు చెందిన బాలురు, బాలికల జట్లు హైదరాబాద్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీడీ రమేశ్‌,హెచ్‌ఎం మహేశ్వర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇండస్‌ మెడికేర్‌ పరిశ్రమలో సీఐటీయూ గెలుపు

13 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన మల్లికార్జున్‌

తూప్రాన్‌: మనోహరబాద్‌ మండలం రామా యంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఇండస్‌ మెడికేర్‌ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. పరిశ్రమలో జరిగిన హోరాహోరీ పోరులో సీఐటీయూ తన జయకేతనాన్ని ఎగురవేసింది. కంపెనీలో మొత్తం 63 ఓట్లు ఉండగా, సీఐటీయూ తరఫున పోటీ చేసిన ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్య క్షుడు.మల్లికార్జున్‌కు 38 ఓట్లు రాగా..ఆయన సమీప ప్రత్యర్థికి 25 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో మల్లికార్జున్‌ 13 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సీఐటీయూ విజయకేతనం ఎగరేయడంపై కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మెదక్‌ జిల్లా కార్యద ర్శి మల్లేశ్‌, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు అడివ య్య, విద్యుత్‌ రంగ నాయకులు స్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement