సైన్స్‌ కాంగ్రెస్‌కు ఐదుగురు విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

సైన్స్‌ కాంగ్రెస్‌కు ఐదుగురు విద్యార్థులు

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

● జిల్లాస్థాయి సైన్స్‌కాంగ్రెస్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులు ● విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలి: డీఈఓ రోహిణి

● జిల్లాస్థాయి సైన్స్‌కాంగ్రెస్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులు ● విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలి: డీఈఓ రోహిణి

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: జిల్లాస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు జిల్లా విద్యాధికారి రోహిణి వెల్లడించారు. జిల్లా సైన్స్‌ కేంద్రంలో మంగళవారం 32వ జిల్లా స్థాయి నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని 100 పాఠశాలల నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 120 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై తమ శాసీ్త్రయ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రోహిణి మాట్లాడుతూ... విద్యార్థులు నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశగా ఆలోచించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాసీ్త్రయ నైపుణ్యాలను పెంపొందిస్తూ, శాసీ్త్రయ దృక్పథాన్ని అభివృద్ధి చేసేలా బోధించాలని తెలిపారు. సైన్స్‌ ఉపాధ్యాయులు సేవ్‌ ఫస్ట్‌ ఇన్నోవేషన్‌, ఈ–వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ వంటి కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు వీరే..

పటాన్‌చెరులోని త్రివేణి పాఠశాల విద్యార్థి జెస్సీకా, జెడ్పీహెచ్‌ఎస్‌ చౌటకూరు విద్యార్థి వర్షిణి, సదాశివపేటలోని సెయింట్‌ ఆంథోనీస్‌ పాఠశాల విద్యార్థి సుశాంక్‌, రామచంద్రాపురంలోని ఠాగూర్‌ కాన్వెంట్‌ స్కూల్‌ విద్యార్థి స్వరూప్‌, పటాన్‌చెరులోని ఆరిజిన్‌ టెక్నో స్కూల్‌ విద్యార్థి సాయికార్తీక్‌యాదవ్‌ విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా డాక్టర్‌ విజయ, వెంకట రామచందర్‌, కందయ్య, డాక్టర్‌.అనిత, డాక్టర్‌ వల్లీ సౌభాగ్యం వ్యవహరించారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి లింబాజీ, సైన్స్‌ అధికారి సిద్దారెడ్డితోపాటు జిల్లా ఎన్‌సీఎస్‌సీ అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్‌ పద్మ, అనిల్‌ కుమార్‌, టీఎస్‌బీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బైండ్ల రామకృష్ణ వివిధ పాఠశాలల గైడ్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement