ఉపాధ్యాయుల కొరత తీర్చాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల కొరత తీర్చాలి

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

స్కూల్‌ కాంప్లెక్స్‌ వద్ద టీచర్ల నిరసన

సదాశివపేట(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్యను పరిష్కరించి జీవో 25ను వెంటనే సవరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సాయిలు డిమాండ్‌ చేశారు. పట్టణంలో జరుగుతున్న ప్రైమరీ లెవెల్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశం వద్ద టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయత్నించడం అభినందనీయన్నారు. అయితే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చడం విస్మరిస్తూ జీవో 25 ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేయడం సమంజసం కాదన్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతను తీర్చి, ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్‌ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 60 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో కేవలం ఇద్దరు టీచర్లే ఉండటం సింగిల్‌ టీచర్‌ స్కూల్‌ ఇంకా కొనసాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా విద్యాశాఖ అధికారి చొరవ తీసుకుని జిల్లాలో తాత్కాలిక టీచర్ల నియామకం కోసం ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు హెప్సీబా, శ్రీశైలం, పీఆర్‌టీయూ నాయకులు, టీపీటీఎఫ్‌ నాయకులు ఏకానంద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement