ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలలో అందిస్తున్న వసతులను రైతులను అడిగి తెలుసుకున్నా రు. తుపాను నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు ఏర్పాటు చేయడంతోపాటు..కొనుగోలు చేసిన ధా న్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారికి ఫోన్‌లో సూచించారు.
బీఆర్టీయూలో చేరిన హెచ్‌ఎంఎస్,
ఐఎన్‌టీయూసీ నాయకులు
జె.కె.ఫెన్నార్ పరిశ్రమకు చెందిన హెచ్‌ఎంఎస్, ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్టీయూలో చేరారు. కార్మికులందరికీ కార్మిక సంఘం కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్టీయూకు రోజురోజుకూ కార్మికుల నుంచి ఆదరణ పెరుగు తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు.


