విద్యారంగం కొత్త పుంతలు | - | Sakshi
Sakshi News home page

విద్యారంగం కొత్త పుంతలు

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

చౌటకూరు ప్రభుత్వ పాఠశాలలో

డిజిటల్‌ స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ ప్రారంభం

’టీచ్‌ ఫర్‌ చేంజ్‌ ట్రస్ట్‌’

వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా చౌటకూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రముఖ సినీ నటి, సామాజిక సేవకురాలు మంచు లక్ష్మి సోమవారం డిజిటల్‌ స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించారు. తన సొంత ఎన్జీవో ’టీచ్‌ ఫర్‌ చేంజ్‌ ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో ఈ తరగతి గదిని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్‌ విద్యను అందించాలనే లక్ష్యంతో స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ, అత్యాధునిక మ్యాటింగ్‌, ఆకర్షణీయమైన పేయింటింగ్స్‌తో తరగతి గదిని తీర్చిదిద్దారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 48 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న ఈ ట్రస్ట్‌, గ్రామీణ విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యాలు, ఫోనిక్స్‌ సామర్థ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి విద్యా సదుపాయాలు కల్పిస్తున్న మంచు లక్ష్మి సేవలను స్థానికులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్‌ సుభాష్‌ రెడ్డి ,గ్రామ సర్పంచ్‌ రాంరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్‌ బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement