మంత్రాల నెపంతో దాడి | - | Sakshi
Sakshi News home page

మంత్రాల నెపంతో దాడి

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

రక్షణ కల్పించాలని అదనపు కలెక్టర్‌కు బాధితుల వినతి

రక్షణ కల్పించాలని అదనపు కలెక్టర్‌కు బాధితుల వినతి

మెదక్‌ కలెక్టరేట్‌: మంత్రాల నెపంతో తమ కుటుంబంపై హత్యాయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని ఆర్టీఐ జిల్లా సెక్రెటరీ మ్యాకల పోచయ్య సహకారంతో బాధితులు అదనపు కలెక్టర్‌ నగేశ్‌కు మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పోచయ్య మాట్లాడుతూ.. మెదక్‌ పట్టణంలోని గోల్కోండ వీధి అంబేడ్కర్‌ కాలనీకి చెందిన నర్సపల్లి ప్రసాద్‌ కుటుంబీకులపై సెప్టెంబర్‌ 24న ఇదే కాలనీలోని కొంతమంది దాడిచేసి తీవ్రంగా గాయపర్చినట్లు తెలిపారు. అలాగే కుటుంబంపై పెట్రోల్‌ పోసి చంపే కుట్ర చేసినట్లు ఆరోపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినా, దాడిచేసిన వారిపై కేసు నమోదు చేయలేదన్నారు. అలాగే మళ్లీ ఇటీవల ఆ కుటుంబంపై దాడిచేయగా పాప శరణ్య చేయి విరిగినట్లు తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు దాడి చేయడంతో బాధిత కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉందని చెప్పారు. మంత్రాల నెపంతో దాడిచేసిన వారిపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. ఈ విషయంపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అదనపు కలెక్టర్‌ను నగేశ్‌ను కోరినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement